- News14
రాణా, రవితేజ ల మల్టీస్టార్రర్ పట్టాలెక్కబోతుంది...
రాణా,రవితేజ లు ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నతు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు కలిసి మలయాళం తెలుగు రీమేక్ లో నటించబోతున్నారు. అయ్యపానుం కొశీయుమ్ మలయాళం లో సక్సెస్ సాదించింది. ఇప్పుడు ఈ మూవీ హక్కులని సితారా ఎంటర్తైమెంట్స్ సొంతం చేసుకుంది.
టాలీవుడ్ లో ముల్టీస్టార్రర్ ట్రెండ్ మహేశ్ అండ్ వెంకటేష్ ల తో మొదలైంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ప్రకటించిన తర్వాత మరింత ఊపుoదుకుంది. మలయాళం లో పృద్వి రాజ్ మరియు బిజూ మీనన్ నటించారు కాగా పృద్వి పాత్రను రాణా, బిజూ మినోన్ కారెక్టర్ ని రవితేజ చేయబోతున్నారు.

ఇప్పటికే ఈ మూవీ కి సంబందించి హింది రైట్స్ ని బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రాహం సొంతం చేసుకున్నారు మరియు తమిళ్ రైట్స్ ని తమిళ్ ప్రొడ్యూసర్ కతిరేశన్ కొనుకున్నారు. తమిళ్ హీరో శశి ఇందులో నటించే అవకాశం వుంది.
మొదట రవితేజ చేయబోతున్న పాత్ర కోసం అలా కృష్ణ ని సంప్రదించినట్టుగా వార్తలున్నాయి. ఇప్పుడు రవితేజ పేరు తెరమీదకి వచ్చింది. ప్రస్తుతం రాణా నటించిన 'అరణ్య' విడుదలకి సిద్దం గా వుంది మరియు 'విరాట పర్వం' షూటింగ్ కరోనా వల్లన వాయిదా పడింది. అయితే రవితేజ 'క్రాక్' షూటింగ్ దశ లో వుంది. వరుస అపజయలతో ఇబ్బందిపడుతున్న మాస్ మహారాజ్ కి ఈ సినిమా అయిన విజయం చేకూరిస్తుందేమో చూడాలి.